Wednesday, January 22, 2025

ఇమ్రాన్ అరెస్ట్ “తుపాకీతో బెదిరించి కిడ్నాప్‌” చేయడమే : ఇమ్రాన్ పార్టీ పిటిఐ ధ్వజం

- Advertisement -
- Advertisement -

లాహోర్ : తెహ్రీక్ ఇఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పంజాబ్ పోలీస్‌లు పనిగట్టుకుని తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేయడమేనని పార్టీ శనివారం ధ్వజమెత్తింది. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పిటిఐ అడిషనల్ సెక్రటరీ జనరల్ ఉమెయిర్ నియాజీ లాహోర్ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా తన పిటిషన్‌పై విచారణ జరపాలని, ఇమ్రాన్ భద్రతను నిర్ధారించడానికి తక్షణమే కోర్టు ముందు ఇమ్రాన్‌ను హాజరు పర్చాలని పంజాబ్ పోలీస్‌లకు, ప్రభుత్వానికి ఆదేశించాలని పిటిషన్‌దారుడు ఉమెయిర్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.

“ అక్రమంగా ప్రభుత్వం ఇమ్రాన్‌ను అదుపులో తీసుకుంది. ఇమ్రాన్ తన జమాన్ పార్కు నివాసంలో శనివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఒక సమావేశానికి హాజరైనప్పుడు దాదాపు 200 మంది పోలీస్‌లు ఆయన ఇంట్లోకి చొరబడి బెదిరించి కిడ్నాప్ చేశారు. అక్రమంగా అదపులో ఉంచారు” అని పిటిషనర్ ఆరోపించారు. అందువల్ల తన పిటిషన్‌ను ఈరోజే ( శనివారమే ) విచారించాలని, కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించాలని కోరారు.

తోషాఖానా కేసులో శిక్ష విధించినట్టు కోర్టు ఉత్తర్వులు ఇమ్రాన్‌కు చూపించకుండానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఎవరికీ తెలియని ప్రదేశంలో ఆయనను దాచి ఉంచారని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు శిక్ష విధించడాన్ని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. ఇది న్యాయాన్ని వధించడం, పారదర్శంకగా విచారణ జరగకుండా ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News