దుబాయ్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షులు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవయవాలు సరిగ్గా పనిచేయడంలేదని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ముషారఫ్ కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఆయన మరణించారని వెలువడ్డ వార్తలు నిరాధారమని ఖండించారు. ఆయన వెంటిలేటర్‌పై లేరని, శరీరం సహకరించకపోవడంతో క్లిష్టపరిస్థితి ఉందని , కోలుకోవడ ం కష్టం అన్పిస్తోందని ముషారఫ్‌కు చెందిన అధికారిక ట్విట్టర్‌లో సమాచారం వెల్లడించారు. 78 సంవత్సరాల ముషారఫ్‌కు భార్య ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2016 సంవత్సరం నుంచి ముషారఫ్ దుబాయ్‌లోనే ఆశ్రయం పొంది గడుపుతున్నారు.
మూడువారం క్రితం రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. పరిస్థితి దిగజారిందనే చెప్పాలి. ఆయన ఆరోగ్యం బాగుపడాలని , దైనందిన జీవితం బాగా ఉండాలని అల్లాను కోరుకుందామని కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు. పాకిస్థాన్ అధ్యక్షులుగా ముషారఫ్ 2001 నుంచి 2008 వరకూ అధికారంలో ఉన్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు సంబంధించి అభియోగాలు ఉన్న ముషారఫ్ గత ఆరు సంవత్సరాలుగా దుబాయ్‌లో ఉంటున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి సైనిక తిరుగుబాటుతో అప్పటి పాకిస్థాన్ మాజీ సైనికాధికారి అయిన ముషారఫ్ అధికారం చేజిక్కించుకున్నారు. కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్ అనేది ఆయన చర్యలతోనే స్పష్టం అయింది.