Thursday, December 19, 2024

మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ పిసిపి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి (92) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేశారు. నర్సారెడ్డి ఎంపిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేయడంతో పాటు  జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. నిర్మల్ జిల్లాకు చెందిన నర్సారెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. 1940 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.  నర్సారెడ్డి మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News