- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సలహాదారుడిగా తరుణ్ కపూర్ సోమవారం నియమితులు అయ్యారు. కపూర్ ఇంతకు ముందు పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పిఎం అడ్వయిజర్ అయిన విషయాన్ని పర్సనల్ మంత్రిత్వశాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్ 1987 ఐఎఎస్ బ్యాచ్ అధికారి అయిన కపూర్ గత ఏడాది నవంబర్ 30 వరకూ పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.
పదవీ విరమణ నాటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఐఎఎస్‌కు ఇప్పుడు ప్రధాని సలహాదారుడిగా పిలుపు వచ్చింది. భారత ప్రభుత్వ శాఖలలో కార్యదర్శి స్థాయి హోదాతో ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారు. ముందుగా ఆయనకు రెండేళ్ల పదవీకాలం ఉంటుంది. ఇక సీనియర్ బ్యూరోక్రట్లు అయిన హరి రంజన్ రావు, అతీష్ చంద్రలు పిఎంఒలో అదనపు సెక్రెటరీలుగా నియమితులు అయ్యారని అధికారిక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -