Wednesday, January 22, 2025

కెన్యా మాజీ అధ్యక్షుడు కిబాకి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former President of Kenya Kibaki no more

నైరోబి: కెన్యా మాజీ అధ్యక్షుడు ఎంవాయ్ కిబాకి తన 90వ ఏట కన్నుమూశారు. కిబాకి మరణ వార్తను కెన్యా అధ్యక్షుడు యుహురు కెన్యాట్ట శుక్రవారం ప్రకటించారు. కిబాకి మరణం దేశానికి తీరని విషాదమని, దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. కిబాకి మరణానికి గల కారణాన్ని తెలియచేయనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాకు అధ్యక్షునిగా 2002 నుంచి 2013 వరకు రెండు పర్యాయాలు కిబాకి పనిచేశారు. 2007లో రెండవసారి ఆయన అధ్యక్షునిగా గెలిచిన తర్వాత ఆయన ప్రతిష్ట మసకబారింది. ఎన్నికల ఫలితాలను రిగ్గింగు చేశారంటూ ఆయన ప్రత్యర్థి రైలా ఒడింగ ఆరోపించడంతో పాటు తదనంతరం దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుని వందలాది మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News