Monday, December 23, 2024

మీ వెంట మేము

- Advertisement -
- Advertisement -

Former Prime Minister Deve Gowda supports CM KCR

మతతత్వశక్తులపై మీరు ప్రకటించిన యుద్ధానికి తుదికంటా మద్దతుగా ఉంటాం
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాజీ ప్రధాని దేవెగౌడ నుంచి ఫోన్
త్వరలో బెంగళూరు వచ్చి మీతో సమావేశమవుతానని బదులిచ్చిన కెసిఆర్

కేంద్రప్రభుత్వ నిరంకుశ ధోరణుల పట్ల దాని మతతత్వ విధానాల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన యుద్ధానికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. మంగళవారంనాడు మాజీ ప్రధాని దేవెగౌడ బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఫోన్ చేసి “ మతతత్వశక్తులపై మీరు ప్రకటించిన యుద్ధం కొనసాగించండి. చివరివరకు మేము అండగా ఉంటాం” అని తెలియజేశారు. ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం ఇస్తూ త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశం అవుతానని దేవెగౌడకు తెలిపారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘ సిఎం కెసిఆర్ సాబ్… మతతత్వ శక్తులపై మీరు చేస్తున్న యుద్ధాన్ని అలాగే కొనసాగించండి! ఇదే విధంగానే ముందుకు సాగండి.. మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ అన్నారు. ఈ మేరకు మంగళవారం సిఎం కెసిఆర్‌కు ఆయన ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ, రావు సాబ్… కేంద్రంపై మీరు అద్భుతంగా పోరాడుతున్నారన్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని సిఎం కెసిఆర్‌తో అన్నారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు మిమ్మల్ని (కెసిఆర్) ప్రశంసించలేక ఉండలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను దేవెగౌడ మనస్పూర్తిగా అభినందించారు. ఇది Aలౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమంతా మీకు అండగా ఉంటామన్నారు.

మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తోందని…. రాజ్యాంగాన్ని యదేశ్చగా ఉల్లంఘిస్తోదన్నారు. రాష్టాల హక్కులను కూడా కాలరాస్తోందని ఈ సందర్భంగా దేవెగౌడ కెసిఆర్‌తో వ్యాఖ్యానిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిజెపియేతర ప్రభుత్వాలన్నా…విపక్షాలన్నీ మోడీ చాలా చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మోడీని ఎదుర్కొనేందుకు ఇదే సరైన సమయమన్నారు. అందరం కలిసి ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం కూడా ఉందని సిఎం కెసిఆర్‌కు దేవెగౌడ సూచించారు. కేంద్రంపై మీరు స్వరం పెంచిన విధంగా త్వరలోనే మరి కొందరు ముఖ్యమంత్రులు కూడా స్పందించే అవకాశముందన్నారు. ఏదేమైనప్పటికీ దేశంలో మతతత్వ శక్తుల అరాచకం పెరగముందే కేంద్రంపై మీరు మొదలు పెట్టిన పోరు అద్భుతమన్నారు. మునుముందు బిజెపియేతర ముఖ్యమంత్రులు కూడా ఇదే బాటలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడనుందన్నారు. ఈ మార్పు కూడా పలు రాష్ట్రాల్లో చాలా స్పష్టం కనిపిస్తోందని దేవెగౌడ వ్యాఖ్యానించారు. కాగా తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమౌతానని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా దేవెగౌడకు తెలిపారు.

దిక్సూచిలా కెసిఆర్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సర్వత్రా మద్దతు లభిస్తున్నది. రోజురోజుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఆయన ఒక దిక్సూచిలా అందిరికి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిఎం కెసిఆర్‌కు బహిరంగంగానే మద్దతును తెలుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ఇప్పటికే తమ మద్దతును తెలిపారు. బిహార్ ఆర్‌జెడి అగ్రనేత అయిన తేజస్వీయాదవ్‌తో పాటు పలువురు కమ్యునిస్టు అగ్రనేతలు కూడా కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్‌కు వచ్చి సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలపై ప్రధానంగా చర్చించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ సిఎం కెసిఆర్ ఫోన్ చేసి…మోడీ ప్రభుత్వంపై మీ పోరాట పటిమ అందరికి స్పూర్తి దాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు సిఎం కెసిఆర్ నేతృత్వంలో శరవేగంగా అడుగులు పెడుతున్నట్లే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్రమోడీపైనా…బిజెపి ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మోడీ హయంలో దేశంలో అధోగతి పాలు అవుతోందని….అందువల్ల దేశానికి ఆయన సేవలు అవసరం లేదని సిఎం కెసిఆర్ నిప్పులు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ స్థాయిలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మోడీ సర్కార్‌పై విరుచుకుపడిన దాఖలాలు లేవు. దీంతో మోడీపై కెసిఆర్ సంధిస్తున్న అస్త్రాలు ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చాంశనీయంగా మారుతున్నాయని తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో ఉత్తరాధికి చెందిన మరిన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కూడా సిఎం కెసిఆర్‌ను కలిసే అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే భవిష్యత్తులో దేశ స్థాయిలో కెసిఆర్ బలంగా చక్రం తిప్పే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది.

ఈ వారంలోనే మహారాష్ట్ర, కర్నాటకుకు కెసిఆర్?

ఈ వారంలోనే మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు సిఎం కెసిఆర్ వెళ్లనున్నారని తెలుస్తోంది. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు కర్నాటకు వెళ్లి మాజీ ప్రధాని దేవగౌడ్‌లో సమావేశమై…దేశ రాజకీయాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరితో సిఎం కెసిఆర్‌తో ఫోన్‌లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా కెసిఆర్ పోరాటం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ మహరాష్ట్ర, కర్నాటకు వెలుతుండడం… దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటన

ఈ నెల 21, 23 తేదీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే సంఘమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా సిఎం ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, జిల్లా మంత్రులు శరవేగంగా చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News