నిరూపించిన మన పివి
నేడు జయంతి, సిఎం కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నర్సింహారావు అని సిఎం కెసి ఆర్ కొనియాడారు. ప్రధానిగా పివి ప్రవేశపెట్టిన సంస్కర ణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని కెసిఆర్ అన్నారు. దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీ యంగా పెంచిన పివి స్ఫూర్తి, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ లో ఇమిడిఉన్నదన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాం క్షిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృ ద్ధి కార్యాచరణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా ని లుస్తుందనే విషయాన్ని పివి నిరూపించారన్నారు. తెలంగాణ బిడ్డగా పివి అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.