Thursday, January 23, 2025

బిజెపిలో చేరిన పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్!

- Advertisement -
- Advertisement -
ఏప్రిల్ 19న అత్వాల్ అకాలీదళ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జెపి. నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. ఏప్రిల్ 19న అత్వాల్ అకాలీదళ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

అత్వాల్ 1937 మార్చి 15న జన్మించారు. 2004 నుంచి 2009 వరకు భారత దేశ 14వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన 14వ లోక్‌సభలో పంజాబ్‌లోని ఫిల్లౌర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పైగా శిరోమణి అకాలీదళ్ సభ్యుడు. పంజాబ్ అసెంబ్లీకి రెండుసార్లు స్పీకర్‌గా కూడా పనిచేశారు.

చరణ్‌జిత్ కుమారుడు ఇందర్ ఇక్బాల్ సింగ్ అత్వాల్‌తో పాటు పంజాబ్‌కు చెందిన పలువురు ఆదివారం న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరడం గమనార్హం. ఢిల్లీలో ఆదివారం బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సీనియర్ బిజెపి నేతల సమక్షంలో వారు అధికారికంగా బిజెపిలో చేరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News