Monday, December 23, 2024

పంజాబ్ మాజీ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95)మంగళవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతన్న బాదల్ వారం రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్ను మూశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో బాదల్ తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి డైరెక్టర్ అభిజీత్ సింగ్ తెలిపారు.అనంతరం ఆస్పత్రి ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది.

సిక్కు వేర్పాటు ఉద్యమంలో భాగంగా ఆవిర్భవించిన అకాలీదళ్ పార్టీకి సారథ్యం వహించినబాదల్ అయిదు సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. రాష్ట్రానికి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రికార్డు బాదల్ సొంతం.1970లో తొలిసారి సిఎం అయిన ఆయన ఆ తర్వాత 1997నుంచి 80 వరకు,1997నుంచి 2002 వరకు, 2007నుంచి 17వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి అకాలీదళ్ మద్దతు పలికింది. అప్పటినుంచి 2020లో కేంద్రం రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలను తీసుకువచ్చేంతవరకు బిజెపి, అకాలీదళ్ మధ్య బంధం కొనసాగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఎన్‌డిఎ కూటమినుంచి బైటికి వచ్చింది.

సిక్కుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటయిన అకాలీదళ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బాదల్ 1995నుంచి 2008 వరకు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత బాదల్ కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీపై గట్టి పట్టు ఉన్న నేత ఆయన. 2015లో బాదల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. బాదల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధధాని మోడీ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు కూడా. బాదల్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పంజాబ్ సిఎం మాన్ సహా వివిధ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాదల్ మృతితో ఒక శకం ముగిసిందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News