Sunday, December 22, 2024

ఆర్‌బిఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చెన్నై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్( 92) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు. భార్య గిరిజా వైద్యనాథన్ గతంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పని చేశారు.పూర్వ ట్రావెన్కూర్ స్టేట్‌లోని నాగర్‌కోయిల్‌లో 1931లో జన్మించిన వెంకటరమణన్ 1990నుంచి 1992 మధ్య ఆర్‌బిఐ గవర్నర్‌గా పని చేశారు. దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్న సమయంలో ఆయన గవర్నర్‌గా ఉన్నారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు1985నుంచి 1989 వరకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. భారత్ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్న సమయంలో వెంకటరమణన్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారని,ఆయన కాలంలోనే సరళీకరణ ఆర్థిక విధానాలను భారత్ అవలంబించడం ప్రారంభమైందని ఆర్‌బిఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News