కుటుంబ సభ్యుల నుండి గణనీయమైన ఆర్థిక సాయం పొందడం ద్వారా బ్రిటిష్ ఆంక్షలను ఉల్లంఘించిన రష్యా ప్రభుత్వ మాజీ మంత్రి డిమిత్రి ఒవ్సియానికోవ్‌కి శుక్రవారం మూడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రిమియాలోని సెవాస్టోపోల్ గవర్నర్‌గా డిమిత్రి ఓవ్సియానికోవ్‌ను నియమించారు. కాగా 2014లో ఉక్రెయిన్ నుండి క్రిమియాను అక్రమంగా స్వాధీనం చేసుకున్న తర్వాత విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తొలి వ్యక్తి అయ్యాడు.
డిమిత్రి ఓవ్సియానికోవ్ తన భార్య నుండి చట్ట విరుద్ధంగా పదివేల పౌండ్లను స్వీకరించడానికి బ్రిటిష్ బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసుకున్నాడని, అంతేకా తన సోదరుడి నుండి బహుమతులు, చెల్లింపులు స్వీకరించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. 48 ఏళ్ల డిమిత్రి ఓవ్సియానికోవ్ ఫిబ్రవరి 2023, జనవరి 2024 మధ్య ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఏడు నేరాలలో ఆరింటిలో దోషిగా సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు బుధవారం నిర్ధారించింది. చివరి నేరం విషయంలో జ్యూరీ తీర్పును ఇవ్వలేకపోయింది. కాగా ఆయన మనీలాండరింగ్ కేసులో కూడా దోషిగా తేలాడు.