Wednesday, January 22, 2025

మాజీ సర్పంచ్ నరసింగరావు మృతి

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: నర్సాపూర్ పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, నర్సాపూర్ మాజీ సర్పంచ్ హనుమంతు నర్సింగరావు (86), శుక్రవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో, చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజకీయ నేపథ్యమున్న నర్సింగరావు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చురుకుగా పనిచేశాడు. నర్సాపూర్ సర్పంచ్ గా పనిచేసి, మంచి పేరు సంపాదించుకుTDన్నాడు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ,ఒక దశలో టిడిపి నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలం చెందాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేయడంతో, కెసిఆర్ తో ఉన్న సన్నిహితంతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరి,పార్టీ అభివృద్ధి కోసం పని చేశాడు.

గత కొంత కాలం నుంచి అనారోగ్యానికి గురైన నర్సింగరావు, ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కుటుంబీకులు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నర్సింగరావు మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం రోజున నర్సింగరావు అంత్యక్రియలు నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయన మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సింగరావు ఇంటికి వెళ్లి, ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ విషయం తెలుసుకున్న పలువురు నాయకులు,ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News