Friday, November 22, 2024

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు డి క్లెర్క్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former South African President FW de Klerk dies

జొహనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఎఫ్.డబ్లు. డి క్లెర్క్ తన 85 వ ఏట కన్నుమూశారు. ఏడాది కాలం నుంచి క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన కేప్‌టౌన్ లోని ఫ్రెస్నయే ఏరియాలో తన స్వగృహంలో మరణించారు. 1989 సెప్టెంబర్ నుంచి 1994 మే వరకు ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన చివరి శ్వేత జాతీయుడు ఆయనే. . జైలులో ఉన్న నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలాను 27 ఏళ్ల తరువాత విడుదల చేస్తున్నట్టు 1990 ఫిబ్రవరి 2 న దక్షణాఫ్రికా పార్లమెంటులో ప్రకటించారు. ఆ తరువాత 1994 లో ఎన్నికలు నిర్వహించారు. క్లెర్క్ తీసుకువచ్చిన సంస్కరణల ద్వారానే మండేలాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించ గలిగింది. 1993 లో ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతిని మండేలాతోపాటు క్లెర్క్ పాలుపంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News