Sunday, December 22, 2024

కారు ప్రమాదంలో దక్షిణాఫ్రికా మాజీ అంపైర్ రూడీ కోర్ట్‌జెన్ (73) మృతి

- Advertisement -
- Advertisement -

Umpire Rudy Koertzen

జోహన్నెస్‌బర్గ్:  దక్షిణాఫ్రికా మాజీ అంపైర్ రూడీ కోర్ట్‌జెన్, మీడియా ద్వారా ‘స్లో ఫింగర్ ఆఫ్ డెత్’ అని లేబుల్ చేయబడిన ఆయన కారు ప్రమాదంలో మరణించినట్లు ఓ కుటుంబ సభ్యుడు మంగళవారం  ఏఎఫ్ పి వార్తా సంస్థ కి తెలిపారు. ఆయన వయసు 73. కేప్ టౌన్ మరియు గ్కెబెర్హా మధ్య స్టిల్‌బాయి సమీపంలో జరిగిన ప్రమాదంలో రూడి ప్రాణాంతకంగా గాయపడ్డాడు” అని పేరు తెలుప నిరాకరించిన కుటుంబ సభ్యుడు తెలిపారు.  “నా తండ్రి కొంతమంది స్నేహితులతో గోల్ఫ్ టోర్నమెంట్‌కు వెళ్లారు, వారు సోమవారం తిరిగి రావల్సి ఉండింది. కానీ వారు మరో రౌండ్ గోల్ప్ ఆడాలనుకుని ఆగిపోయి ఉంటారు ’’ అని ఆయన కుమారుడు రూడి ఒక గ్కెబెర్హా రేడియో స్టేషన్‌తో చెప్పాడు. కాగా దక్షిణాఫ్రికా జట్టు బుధవారం లండన్‌లోని లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడే టెస్ట్ మ్యాచ్‌లో కోర్ట్‌జెన్ గౌరవార్థం నల్లటి బ్యాండ్‌లు ధరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News