Sunday, January 12, 2025

దక్షిణ కొరియా మాజీ మంత్రి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

సియోల్ : దక్షిణ కొరియా రక్షణశాఖ మాజీ మంత్రి కిమ్‌యాంగ్ హ్యూన్, పోలీస్‌ల కస్టడీ లోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ చివరినిమిషాల్లో ఆయన ప్రయత్నాలను అడ్డుకున్నారు. గత రాత్రి బలవన్మరణానికి పాల్పడేందుకు కిమ్ ప్రయత్నించారు. గత ఆదివారం నుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం ఆయనను అధికారికంగా పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అరెస్టుకు కొన్ని నిమిషాల ముందు హ్యూన్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. తనను అరెస్టు చేయబోతున్నారని తెలియగానే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారని కొరియా పార్లమెంట్ లో కమిషనర్ జనరల్ ఆఫ్ కొరియా కరెక్షనల్ సర్వీస్ తెలియజేశారు. కొరియా మీడియా సంస్థ షిన్‌యోంగ్ హేలో కథనం ప్రకారం హ్యూన్ డిటెన్షన్ సెంటర్ లోని టాయిలెట్‌కు వెళ్లి అక్కడ తన అండర్‌వేర్‌తో ఉరిపోసుకోడానికి ప్రయత్నించారు. కానీ కరెక్షనల్ అధికారులు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతంఆయనను గార్డింగ్ రూమ్‌లో పెట్టారు.

ఇటీవల దక్షిణ కొరియా నుంచి సైనిక పాలన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదన చేసింది మంత్రి కిమ్. దక్షిణ కొరియాలో డిసెంబర్ 3న సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. కొరియాలో సైనికపాలన విధించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై అధ్యక్షుడు యూన్‌సుక్ ఇయోల్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈకేసులో రక్షణ మంత్రి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అరెస్టుకు ముందు ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. హ్యూన్‌ను కఠినంగా శిక్షిస్తామని బుధవారం కొరియా కోర్టు ప్రతినిధి తెలిపారు. సైనిక పాలన విధించే విషయంలో ఆధారాల కోసం అధ్యక్షుడు కార్యాలయం లో పోలీస్‌లు తనిఖీలు చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News