- Advertisement -
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ(73) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె బుధవారం ఉదయం చనిపోయారు. కుతూహలమ్మ వైద్య వృత్తి నుంచి చిత్తూరు జడ్‌పి చైర్మన్‌గా రాజకీయం ప్రవేశం చేశారు. నెల్లూరు జిల్లాలోని వేపంజేరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్ర వర్గంలో వైద్యారోగ్య, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. వైఎస్‌ఆర్ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని 2014లో తెలుగు దేశం పార్టీలో చేరారు. 2014 టిడిపి నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో టిడిపికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
- Advertisement -