Sunday, February 23, 2025

మాజీ మంత్రి జె.ఆర్ పుష్పరాజ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former TDP minister JR Pushparaj passed away

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జె.ఆర్ పుష్పరాజ్ గురువారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాడికొండ నుంచి పుష్పరాజ్ మూడు సార్లు ఎంఎల్ఏగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్, నారా చంద్రబాబు హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల గుంటూరుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మృతిపై టిడిపి నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News