Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ టీచర్ ఎంఎల్‌సి బి. మోహన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ టీచర్ ఎంఎల్‌సి, పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం పూర్వ నాయకులు బి.మోహన్ రెడ్డి గురువారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. బిజెపికి రాజీనామా చేసి గురువారం బిఆర్‌ఎస్‌లో చేరినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. తిరిగి అధికారంలోకి రానున్న సిఎం కెసిఆర్ ప్రభుత్వ సారధ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాల పైన కలిసి పని చేసేందుకు బిఆర్‌ఎస్ పార్టీలో చేరు తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డిని సాదరంగా కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News