Wednesday, January 22, 2025

బిజెపిలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కమలం తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రం అందించి ఆమెను సత్కరిం చారు. తమిళిసై గతంలో తమిళనాడు బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా ఆపార్టీ నాయకురాలి గానే కొనసాగుతున్నారు. 2019 లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్‌గా నియమించడంతో గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో కమలం అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో తమిళిసైకి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని తాను బిజెపి సభ్యత్వాన్ని తిరిగి పొందడం నాకు సంతోషంగా ఉందన్నారు. గవర్నర్‌గా నాకు చాలా సౌకర్యాలు ఉన్నప్పటికి ఆ పదవిని విడిచి పెట్టానన్నారు. అందుకు నేను ఒక్క శాతం కూడా చింతించను రాబోయే రోజుల్లో తమిళనాడులో కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News