Sunday, December 22, 2024

వైసీపీకి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై

- Advertisement -
- Advertisement -

వైసీపీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుడ్ బై చెప్పారు. ఆమె 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరారు. అప్పుడు ఆమెకు టికెట్ దక్కలేదు సరికదా ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోయేసరికి కృపారాణి ఆగ్రహంతో ఉన్నారు. ‘నాకు ఎంపి టికెట్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఎందుకో కారణం తెలియదు. పార్టీలో నాకు కనీస గౌరవం కూడా దక్కట్లేదు. నాకు పదవులకంటే గౌరవమే ముఖ్యం’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడు కిల్లి విక్రాంత్ ని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News