Thursday, December 26, 2024

కెటిఆర్‌కు ఫోన్‌ చేసిన యూపీ మాజీ సిఎం

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్యంపై చర్చించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు.
తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్‌కు తీవ్ర గాయాలు కావడంతో యశోద ఆస్పత్రిలో ఎడమ కాలికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.

శస్త్రచికిత్స అనంతరం ఎనిమిది వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం కెసిఆర్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, ఆపరేషన్ అనంతరం నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అతని కోలుకోవడానికి వైద్యులు వాకర్‌తో సహాయం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News