Wednesday, January 22, 2025

యుపి మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి శుక్రవారం ఇక్కడి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, భోపాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 11 గంల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారని అజీజ్ ఖురేషి మేనల్లుడు సుఫియాన్ అలీ తెలిపారు.

ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్దదేశ్, మిజోరం రాష్ట్రాల గవర్నర్‌గా ఖురేషి పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా 1972లో ఎన్నికైన ఖురేషి 1984లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఖురేషి అవివాహితులని చివరి వరకు ఆయన బాగోగులు చూసుకున్న సుఫియాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News