Sunday, February 23, 2025

ఎస్‌పిలో చేరిన యుపి మాజీమంత్రి దారాసింగ్

- Advertisement -
- Advertisement -

Former UP minister Darasingh joins SP

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మాజీమంత్రి,ఒబిసినేత దారాసింగ్‌చౌహాన్ సమాజ్‌వాదీపార్టీలో చేరారు. ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ సమక్షంలో ఆదివారం చౌహాన్ ఆ పార్టీలో చేరారు. బిజెపి నుంచి గత ఎన్నికల్లో చౌహాన్ ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. అప్పాదళ్‌కు చెందిన ఎంఎల్‌ఎ ఆర్‌కె వర్మ కూడా ఎస్‌పిలో చేరారు. యుపిలోని బిజెపి కూటమిలో అప్పాదళ్(సోనేలాల్) భాగస్వామ్య పార్టీ. మాజీమంత్రులు స్వామిప్రసాద్‌మౌర్య, ధరమ్‌సింగ్‌సైనీతోపాటు ఐదుగురు బిజెపి ఎంఎల్‌ఎలు, ఒక అప్పాదళ్ ఎంఎల్‌ఎ శుక్రవారం ఎస్‌పిలో చేరారు. బిజెపి కొద్దిమంది ధనికుల కోసమే పని చేస్తున్నదని చౌహాన్ విమర్శించారు. ఎస్‌పిలో చేరడం తన సొంత గూటికి వచ్చినట్టుగా ఉన్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News