Thursday, January 2, 2025

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియా లోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచినట్టు ఆయన తనయుడు జేమ్స్ ఇ కార్టర్ 3 తెలిపారు. జిమ్మీ కార్టర్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి , స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్రవేశారని బైడెన్ పేర్కొన్నారు. జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు.

అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైట్‌హౌస్ వెల్లడించింది. 1924 అక్టోబరు 1న జన్మించిన జిమ్మీ కార్టర్ , ఈ ఏడాది తన వందో పుట్టిన రోజును ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. జార్జియాలో పుట్టిన కార్టర్…197781 మధ్య కాలంలో అగ్రరాజ్యానికి 39 వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓ రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్, ప్రెసిడెంట్‌గా , అన్నింటికీ మించి మానవతావాదిగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు. 2002 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారినీ జయించిన దృఢ సంకల్పం ఆయన సొంతం. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు అధ్యక్షునిగా పనిచేసి , వందేళ్లు బతికిన తొలి వ్యక్తిగానూ నిలిచారాయన. 1978లో భారత్ పర్యటనకు కార్టర్ వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానా లోని ఓ గ్రామానికి కార్టర్‌పురిగా నామకరణం చేశారు.

జిమ్మీకార్టర్ గొప్ప రాజనీతిజ్ఞుడు : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీకార్టర్ (100) మృతిపై ప్రధాని నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని , ప్రపంచ శాంతి సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. భారత్ అమెరికాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కార్టర్ సహకారం మరువలేనిదని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యానికి అధిపతిగా తనదైన ముద్రవేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News