Tuesday, November 5, 2024

ఓ కంపెనీకి యజమానులుగా మాజీ మహిళా నక్సలైట్లు

- Advertisement -
- Advertisement -

Former women Naxalites as owners of a company

 

నాగపూర్: లొంగిపోయిన మాజీ మహిళా నక్సలైట్లు ఓ కంపెనీకి యజమానురాళ్లుగా నూతన జీవితం ప్రారంభించారు. పోలీసుల సాయంతో మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో వారు ఈ ఘనతను సాధించారు. ఇండ్లు శుభ్రం చేసే ఫినైల్ తయారీ కంపెనీని వారు ప్రారంభించారు. 11మంది మాజీ నక్సలైట్లకు ఫినైల్ తయారీలో శిక్షణ ఇప్పించామని గడ్చిరోలీ జిల్లా ఎస్‌పి అంకిత్‌గోయల్ తెలిపారు. వారిలో పదిమంది మహిళలు కాగా, ఒకరు పురుషుడు. ‘క్లీన్ 101’ బ్రాండ్ పేరుతో ఫినైల్‌ను ఇటీవలే మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్టు గోయల్ తెలిపారు. లొంగిపోయిన మహిళా నక్సలైట్ల కోసం నవజీవన్ ఉత్పాదక్ సంఘ్ పేరుతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. క్లీన్ 101 నాణ్యతలో ఉన్నతంగా ఉన్నదని, ధర కూడా ఇతర కంపెనీలకన్నా చాలా తక్కువని ఆయన తెలిపారు. మార్కెటింగ్ కోసం తమ పోలీస్‌శాఖ వారికి తోడ్పాటునిస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయన్నారు. అకోలాలోని డా॥పంజారావు దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ నుంచి 200 లీటర్ల ఫినైల్‌కు ఆర్డర్ వచ్చిందని తెలిపారు. గడ్చిరోలీ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉండటంతో లొంగుబాట్లను ప్రోత్సహించే దిశగా ఆ రాష్ట్ర పోలీస్‌శాఖ చొరవ చూపుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News