Thursday, November 14, 2024

పంట నష్టపరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు…

- Advertisement -
- Advertisement -

జనగామ: గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి, మామిడి తదితర పంటలు నష్టపోయాయని, ప్రభుత్వం తమకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ బుధవారం జనగామ మండలం అడవి కేశవపురంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారికి సీపీఐ నాయకులు మద్దతు పలికారు.

ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీలు రాజకీయాలు మానుకొని కేంద్రం, రాష్ట్రం నుంచి పరిహారం అందేందుకు కృషిచేయాలన్నారు. ఒక్కో ఎకరానికి కనీసం రూ.50వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాతూరు సుగుణమ్మ, ఆది సాయన్న, సోమయ్య, గుర్రం మధు, పాతూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News