Monday, December 23, 2024

ఫార్ములా ఈ కార్ రేస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఫార్ములా ఈ కార్ ప్రధాన రేస్ శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. 2.8 కిలో మీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ లో ఫార్ములా ఈ కార్ రేస్ జరగనుంది. ఫార్ములా వన్ రేస్ కోసం భారత క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్‌లో భారతదేశంలోనే మొట్టమొదటి ఫార్ములా వన్ ఈవెంట్‌ను నగరం నిర్వహిస్తోంది. ఈ రేసు తొమ్మిదో సీజన్ నాల్గవ రౌండ్, 11 జట్లు, 22 డ్రైవర్లు అగ్రస్థానం కోసం పోటీ పడనున్నారు. ఈ రేస్ గంటన్నర పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. కేటీఆర్, రామ్ చరణ్, సచిన్ టెండూల్కర్, నమ్రతా శిరోద్కర్, నారా బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతి సహా పలువురు ప్రముఖులు, వీఐపీలు ఫార్ములా ఈ కార్ రేసుకు హాజరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News