Friday, November 22, 2024

ఫార్ములా ఈ రేస్ రద్దు

- Advertisement -
- Advertisement -

హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించారని మున్సిపల్ శాఖకు నోటీసులు

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు తెలంగాణ మున్సిపల్ శాఖకు నోటీసులు ఇచ్చారు. ఈ -రేస్ సీజన్ 10కు చెందిన నాలుగో రౌండ్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 30వ తేదీ జరగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఫార్ములా ఈ రేస్‌ను నిర్వాహకులు ఆ నోటీసులో పేర్కొన్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎఫ్‌ఈఓ తెలిపింది. గత తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఈ రేస్‌ల మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఆ ఒప్పందం రద్దు కావడం విశేషం.
ఈ నిర్ణయం నిరాశపరిచింది: ఆల్బర్టో లాంగో
ప్రభుత్వం సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం తమను నిరాశపరిచినట్లు ఫార్ములా ఈ చీఫ్ చాంపియన్ షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లాంగో తెలిపారు. భారత్ మోటార్ స్పోర్ట్ అభిమానులను ఈ విషయం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. వరల్డ్ చాంపియన్ షిప్ రేస్ ఈవెంట్ హైదరాబాద్ నిర్వహించడం కీలకమైందని, కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కార్ నిర్ణయం వల్ల ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నట్లు ఆల్బర్టో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News