హైదరాబాద్‌లో ఫార్ములా ఈ- రేస్ రద్దైంది. నగరంలోని హుస్సేన్ సాగర తీరాన ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేసు రద్దు చేస్తున్నట్టు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్(ఎఫ్ఐఏ) ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఎఫ్ఐఏ వెల్లడించింది.
దీనిపై స్పందించిన మాజీ ఐటీ మంత్రి కెటిఆర్.. ఫార్ములా ఈ- రేస్ పై ప్రభుత్వం తిరోగమన నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడుల కోసం ఫార్ములా ఈ-రేస్ ను ఉపయోగించుకున్నామన్నారు. ఈ-ప్రిక్స్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ను చాటేదని.. అలాంటి ఈవెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గమని కెటిఆర్ విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ-రేసును హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.