Wednesday, January 22, 2025

ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు ముమ్మరంగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్ములా ఈ రేసింగ్ ఈనెల 11వ తేదీన జరుగనుండగా దీనికోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రాక్టీస్ మ్యాచ్‌ను హుస్సేన్‌సాగర్ తీరాన నిర్వహించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకొని అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఈ రేసింగ్‌కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఫార్ములా ఈ రేసింగ్ కి 21,000 మంది వీక్షించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం
11 స్టాండ్లు, 7 గేట్లు, నాలుగు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 16 ప్రాంతాలు, 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును చేపట్టారు. వీరికితోడు 275 మంది ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు విధుల్లో ఉండనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం, మన నగరంలో ఈ పోటీలను నిర్వహించబోతున్నారు.

వాహనదారులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండడంతో నగరవాసులందరూ సహకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 06 వ తేదీ నుంచి వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ మళ్లీంపు ఉండడంతో పాటు ఈనెల 07వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్ పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఈనెల 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం, ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News