Friday, November 15, 2024

ఫార్ములా ఈ రేస్.. ఎన్‌టిఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్ సందర్భంగా ఎన్‌టిఆర్ మార్గ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లడానికి అనుమతిలేదు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్టమైసమ్మ దేవాలయం లేదా లోయర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలి. ఇక్బాల్ మినార్ లేదా రవీంద్రభారతి వద్ద కుడి మలుపు తీసుకుని పబ్లిక్ గార్డెన్స్ జంక్షన్, బషీర్‌బాగ్, లిబర్టీ వైపు వెళ్లి బిఆర్‌కె భవన్ లేదా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లవచ్చు.
బుద్ధభవన్ లేదా నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్డు, ఐమ్యాక్స్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్, నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ లేదా ట్యాంక్‌బండ్ వైపు మళ్లించబడుతుంది.

రసూల్‌పురా లేదా మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.

వివి విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్, నెక్లెస్ రోడ్ ఐమ్యాక్స్ రోటరీ వైపు అనుమతించరు, వివి విగ్రహం వద్ద షాదన్ కాలేజీ, రవీంద్రభారతీ వైపు మళ్లించబడుతుంది.

ట్యాంక్‌బండ్ లేదా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ లేదా రవీంద్రభారతి జంక్షన్ వైపు మళ్లించబడదు.

బిఆర్‌కెఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు,తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ లేదా రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించవచ్చు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు, ఇక్చాల్ మినార్ జంక్షన్‌ణ వద్ద రవీంద్రభారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఖైరతాబాద్ బడాగణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు, బడా గణేష్ వద్ద రాజ్‌దూత్‌లేన్ వైపు మళ్లించబడదు.

రద్దీ ఉండే జంక్షన్లు….

వివి విగ్రహం, పాతసైఫాబాద్ పిఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్ బండ్, ట్యాంక్‌బండ్, నాంపల్లి, ఎన్‌ఎండిసి,మాసబ్‌ట్యాంక్ జంక్షన్లలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు ఈ జంక్షన్ల గుండా ప్రయాణించకుండా ఉండాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News