Thursday, January 23, 2025

మళ్లీ రేసింగ్ జోరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి రేసింగ్ కార్లు సందడి చేయనున్నాయి. వచ్చే నెల 11వ తేదీ నుంచి (వరల్డ్ ఛాంపియన్ షిప్) హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఇండియాలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా -ఈ వర ల్డ్ ఛాంపియన్ షిప్ జరగనుండగా మొత్తం 11 దేశాలకు చెందిన 22మంది ఈ పోటీల్లో పాల్గొననున్నా రు. ఈ నెల 10వ తేదీన రేసింగ్ ప్రాక్టీస్ జరుగనునుండగా ఎన్వీరాన్‌మెంట్, ఎనర్జీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నినాదంతో ఎలక్ట్రిక్ రేస్ కార్లు పాల్గొననున్నా యి. ఈ పోటీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఫో ర్డ్, జాగ్వార్, నిస్సాన్ వంటి 11 కంపెనీల కార్లు ఇందులో పాల్గొననున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్‌లో స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ పూర్తికావడంతో ఆ ప్రా క్టీస్ పోటీలు ప్రస్తుతం నిర్వాహకులకు సరికొత్త అనుభవాలను నేర్పాయి. మన రాష్ట్రంలో కెటిఆర్ ప్రత్యేక చొరవతో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్ రేసింగ్‌ను ప్రభుత్వం సవాల్‌గా స్వీకరించింది. హైదరాబాద్ రోడ్డులో ఇలాంటి రేసింగ్‌లు సక్రమంగా జరుగుతాయా అన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆ పోటీలను నిర్వహించింది. ఇందుకోసం ప్రత్యేకంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 2.8 కి.మీల స్ట్రీట్ సర్క్యూట్‌ను తయారుచేశారు. వీటిని తట్టుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టగా మొదటి రోజే రేసర్లకు పెద్ద పరీక్ష ఎదురైంది. ట్రాక్ సరిగ్గా లేకపోవడం తో కొన్నికార్లు బోల్తా పడ్డాయి. డైవర్ల అప్రమత్తతో స్వల్ప గాయాలతో రేసర్లు బయటపడ్డారు. దీనిని సవాల్‌గా తీసుకున్న నిర్వాహకులు కొద్ది రోజుల్లోనే మళ్లీ రోడ్లను పునరుద్ధరించి ప్రాక్టీస్ పోటీలను నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News