Friday, December 20, 2024

పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యమని వినియోగదారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు రేషన్ డీలర్లను సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని రేషన్ డీలర్లతో పోర్టిఫైడ్ రైస్ పై సమావేశం నిర్వహించారు. పోర్టీ రైస్ బియ్యం చాలా బలవర్ధకమైనవని, దేశంలో ఆహార భద్రత సుస్థిరమవుతు న్న దశలో ఇకపై ప్రజలలో పౌష్టికాహార లోపం ఉండకూడదన్న లక్షంతో, పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు, సప్లమెంట్లు కలపడాన్నే పోర్టిఫైడ్ అంటారని తెలిపారు. కేంద్ర ఆహార, ప్రజాపంపణీ వ్యవహారాల శాఖ ఇటీవల ఫోర్టిఫైడ్ రైస్ కెన్నెల్స్ పై యూనిఫామ్ మర్గదర్శకాలు జారీ చేసిచేసిందని పేర్కొన్నారు.

గ్రేడ్ ఏ, కామన్ గ్రేడ్ బియ్యంలో 1శాతం మేర ఈఎస్‌ఆర్‌కే కలపాలని నిర్ధేశించిందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఇ తర సంక్షేమ పథకాల ద్వారా కేంద్రం పంపిణీ చేసే బియ్యంలో వీటిని కలపాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుండి మన జిల్లాలో ప్రజలలో పోషక విలువలు పె ంచేందుకు తద్వారా పోషకాహార లోపాన్ని ప్రజలలో నివారించడానికే పో ర్టిఫైడ్ రైస్‌ను మన జిల్లాలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి విటమిన్లు, పోషకాలను కలిపి అనంతరం ఆ పిండిని బియ్యం పోలికతో కెన్నెల్స్ మార్చుతారు.

ప్రతి క్వింటాలు బియ్యానికి 1కిలో ఫార్టిఫైడ్ రైస్ కెన్నెల్స్ ప్రత్యేక యంత్రాలు ద్వారా కలుపుతారని అన్నారు. విటమిన్ బి 12 మెదడు, నాడీ వ్యవస్థను సక్రమంగా పని చేయించడంలో సహకరిస్తుందని, శరీరంలో రక్తం తాయరు కావటానికి సహాయపడుతుందని అన్నారు. పోర్టిఫైడ్ బియ్యంను నిల్వ చేసేటప్పుడు అట్టి గదిలో నీరు గానీ, చెమ్మగాని ఉండకుండా చూడాలని లేనిచో మినరల్స్‌తో కూడిన పోషకాలు బూజు పట్టే అవకాశం ఉందన్నారు. బియ్యం బస్తాలు గదిలో గోడలకు తా కకుండా నిల్వచేయాలని అలాగే కార్డుదారులకు ఈ రైస్ పై పెద్ద ఎత్తున వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గోడ పత్రికలు, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఎస్‌ఓ కిషోర్‌కుమార్, డిఎం రాంపతి, ఏఎస్‌ఓ పుల్లయ్య, డిటి రాజశేఖర్, రేషన్ డీలర్ల అధ్యక్షులు నాగరాజు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News