Thursday, January 23, 2025

‘ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌’ ప్రచారకర్తగా సమంత..

- Advertisement -
- Advertisement -

Fortune Sunflower Oil Launches TVS Featuring Samantha

హైదరాబాద్: విస్తృతశ్రేణిలో వంటనూనెలు, ఆహార ఉత్పత్తులను ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ కింద విడుదల చేస్తోన్న అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ ఇప్పుడు ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నూతన టీవీ కమర్షియల్‌ (టీవీసీ)ను దక్షిణాది నటి సమంత ప్రభు నటించగా విడుదల చేసింది. ఈ టీవీసీని ఓగ్లీవీ అండ్‌ మాథర్‌ నేపథ్యీకరించగా అతి తేలికైన సన్‌ఫ్లవర్‌ నూనెగా కొనసాగుతున్న ప్రచారాన్ని మరింత అందంగా వెల్లడిస్తుంది. ఆరోగ్యం, తేలికపాటి నూనె అనే అంశాలను ఈ టీవీసి ప్రస్ఫుటంగా వెల్లడిస్తుంది. ‘‘దక్షిణాది చిత్రాలలో ప్రాచుర్యం పొంది న నటి సమంత. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆమె కీర్తిగడించారు. మా బ్రాండ్‌ ప్రచారకర్తగా ఆమె దక్షిణాది మార్కెట్‌లలో వినియోగదారులను కనెక్ట్‌ అయ్యేందుకు తోడ్పడనున్నారు. ఈ టీవీసీలో ఆమె ఫార్క్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌తో ఆహారం వండిన తరువాత చాలా తేలిగ్గా ఉందని, కెమెరా ముందు తేలిగ్గా నటించేందుకు సైతం తోడ్పడుతుందని వెల్లడిస్తారు’’అని ముకేష్‌ కుమార్‌ మిశ్రా, వైస్‌ ప్రెసిడెంట్‌– సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, అదానీ విల్మార్‌ అన్నారు.

అదానీ విల్మర్‌ తో భాగస్వామ్యం గురించి నటి సమంత ప్రభు మాట్లాడుతూ.. ‘‘ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కోసం అదానీ విల్మర్‌ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యాన్ని సహజంగానే ఇష్టపడ్డాను. ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తేలిగ్గా ఉండటంతో పాటుగా భోజనం అధికంగా తీసుకున్నప్పటికీ తేలిగ్గా ఉందన్న భావన అందిస్తుంది’’ అని అన్నారు. ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఇప్పుడు స్టోర్స్‌లో లీటర్‌కు 210 రూపాయల ధరలో లభిస్తుంది.

Fortune Sunflower Oil Launches TVS Featuring Samantha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News