Wednesday, January 22, 2025

ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేత సుందరనాయుడు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Foultry Federation leader Sundaranayudu Passed away

 

మనతెలంగాణ/హైదరాబాద్:  ఫౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు ఉప్పలపాటి సుందరనాయుడు (85) గురువారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

బాలాజీ హేచరీస్ అధినేతగా , తొలితరం పారిశ్రామిక వేత్తల్లో ఒకరుగా తెలుగురాష్ట్రాల్లో గుర్తింపుపోందిన సుందర నాయుడు 1336జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణం పల్లెమండలం కంపలపల్లెలో జన్మించారు. మద్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన పశువైద్యవిద్యను అభ్యసించి కొంతకాలంపాటు వైద్యులుగా పనిచేశారు. అతర్వాత హేచరీస్‌ను స్థాపించి అంచెలంచలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపిలో రాష్ట్ర ఫౌ్రల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News