Monday, December 23, 2024

లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మండలంలోని ఎం వెంకటాయ పాలెం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు బుధవారం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి లో లెవెల్ బ్రిడ్జి ఇక్కడ లేకపోవడం వల్ల గ్రామంలో ఉన్న గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి పనులు నా పిరియడ్ కావడం ఎంతో సంతోషంగా అనిపిస్తుందన్నారు. నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ను త్వరితగతిన పని పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందించాలని కోరారు. నియోజకవర్గంలో గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసే దిశగా చేయడం నా లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఎంపిపి బెల్లం ఉమా, జెడ్‌పిటిసి యండపల్లి వరప్రసాద్, సూడా డైరెక్టర్ గూడా సంజీవ రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, స్థానిక సర్పంచి మందటి సంధ్యారాణి, ఆర్ ఎస్ ఎస్ కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, ఏదులాపురం సొసైటీ చైర్మన్ జరుపల లక్ష్మణ్ నాయక్, మారెమ్మ గుడి చైర్మన్ మట్టా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నండ్రా ప్రసాద్, వెంపటి రవి, కొప్పుల ఆంజనేయులు, నాయకులు కుర్రా వెంకన్న, రామగిరి వెంకన్న, ఉప సర్పంచ్ పడిగల ఉపేందర్, కొలిచలం మాధవరావు, కొట్టే వెంకట్రావు, బేతంపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News