Monday, December 23, 2024

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -
  • మణుగూరులో పర్యటించిన మంత్రి పువ్వాడ, విప్ రేగా

మణుగూరు : మండల పరిధిలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుట్టమల్లారం గ్రామంలో సుమారు రూ 50 లక్షలతో నిర్మించనున్న ఆర్‌టివో కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా అంబేద్కర్ సెంటర్ నుంచి కోడిపుంజులవాగు వరకు ఆర్‌అండ్‌బి రోడ్డుకి ఇరువైపులా సుమారు రూ.2 కోట్ల 60 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి చినరావిగూడెం మీదుగా నెల్లిపాక వరకు సుమారు రూ.2 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్ధాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News