Wednesday, January 22, 2025

బాలాజీనగర్‌లో రూ.4.58కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: బాలాజీనగర్ డివిజన్‌పరిధిలో 4కోట్ల 58కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శనివారం ఎ మ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కేపీహెచ్‌బికాలనీ రో డ్డు నెంబరు 1లోని పార్కు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన అనంతరం ఖైత్లాపూర్, ముష్కిపేటలోని వివిధ సీసీ రోడ్డు నిర్మాణ ప నులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైతే పార్కుల పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు కూడా త్వరగా పనిచేస్తున్నామని తెలిపారు.

ఈ తొమ్మిదేళ్ళకాలంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు నిర్మాణం , ఇంటింటికి మంచినీరు 24గంటల విద్యుత్‌తో సహా అన్ని మౌళిక సదుపాయాలకు ఎక్కడా కొరత లే కుండా చూసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోకొసారి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే ఆదర్శరాష్ట్ర ంగా మారి అభివృద్దికి చిరునామాగా మారుతుందనడంలో ఎలాంటి సం దేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబూరావు, కో ఆర్డినేటర్‌సతీష్ అరోరా, ప్రభాకర్‌గౌడ్, ఈఈ సత్యనారాయణ, డిఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News