Monday, December 23, 2024

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కూసుమంచి : రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని నాయకన్ గూడెం-భవత్ వీడు గ్రామ రైతుల కోరిక మేరకు ప్రత్యేక చొరవ తీసుకొని గత 40 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకొని భవత్ వీడు మేజర్ (నాగార్జున్ సాగర్ కాలు) మరమ్మతులకు 15 లక్షల నిధులు మంజూరు చేయించి, మరమ్మత్తు పనులకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాయకన్ గూడెం ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అదే గ్రామంలో 8.80 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు,అంగన్‌వాడీ కేంద్రంలో బాత్రూమ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాసాని సైదులు, కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శి వేముల వీరయ్య మహమ్మద్ ఆసిఫ్ పాషా, రామ సాయం బాలకృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News