Monday, December 23, 2024

బిఎన్‌రెడ్డి నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : బిఎన్‌రెడ్డి నగర్‌లో సుమారుగా నాలుగు కో ట్ల రూపాయలతో అభివృద్ధ్ది కార్యక్రమాలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలో రూ.2 కోట్లతో కృష్ణ వా టర్ పైపులైన్లు మరియు రూ.1 కోటి 96లక్షల 80 వేలతో సిసిరోడ్డు ,క మ్యూనిటీహల్ ,పార్కు ,కాంపౌండ్‌వాల్ ,చైన్‌లింక్ ఫేన్సింగ్ పనులు ,బృం దావన్ మిడోస్ కాలనీ ,జక్కడి నగర్ ,శ్రీగాయత్రినగర్ కాలనీ ,గాయత్రి నగర్ ఫేస్ 4 కాలనీలలో కృష్ణ తాగునీటి పైపులైన్లు ,మారుతినగర్ కాలనీ లో సిసిరోడ్లు ,ఆఫీసర్ కాలనీలో రూ.13.60 లక్షలతో నూతనంగా ని ర్మించిన కాంపౌడ్ వాల్ నిర్మాణం ,

తాగునీటి పైప్‌లైన్ రూ.57.50 లక్షల తో ,సాహెబ్‌నగర్ క్రాంతి యువజన సంఘ భవన నిర్మాణానికి రూ.54 లక్షలతో ,స్నేహమయినగర్ కాలనీలో సిసిరోడ్డు రూ.28.70 లక్షలతో , ఎస్‌కెడినగర్ కమ్యూనీటీ హల్ గ్రౌండ్ చుట్టు చైన్ లింక్ ఫేన్సింగ్ ,వాకిం గ్ ట్రాక్ నిర్మాణానికి రూ.17లక్షలతో ,ఎస్‌కెడినగర్ కమ్యూనిటీ హల్ వె నుక రోడ్డులో నూతన సిసిరోడ్డు నిర్మాణానికి రూ.26లక్షలతో ,శ్రీరాం న గర్ కాలనీలో సిసిరోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డిల తో కలసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేయడం జరిగిందని ,చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయిని తెలిపారు. ద

శలవారీగా వాటిని ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తానని హమీ ఇ చ్చారు. శివారు కాలనీలకు ప్రతి ఒక్కరికి నీటి సౌకర్యం కల్పించడం తమ ప్రభుత్వ లక్షం ,ముందుగా తాగునీరు ,డ్రైనేజీ ,రహదారులకు ప్రాధన్య త ఇవ్వడం జరగుతుందని ,118 జీవో ద్వారా ఎంతో మంది ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షలు అరవింద్‌రెడ్డి ,కుంట్లూర్ వేంకటేష్ గౌడ్ ,నర్సింగ్‌రావు ,అనిల్ చౌదరి ,సామ బుచ్చిరెడ్డిలు ,కాలనీ వాసులు ,పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News