Thursday, January 23, 2025

పాశమైలారం నుంచి కర్ధనూరు ఒఆర్ఆర్ జంక్షన్ రహదారి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

 

Foundation laying Pashamailaram to Kardhanur ORR

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుంచి కర్ధనూరు ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరసల బీటీ రహదారి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.  పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు రాజగోపురాలు, నిత్య అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, 24 దుకాణాల సముదాయాల నిర్మాణాలకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News