- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన హైకోర్టు భవనం నిర్మాణ పనుల కు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై. చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేర కు అధికారులు శంకుస్థాపనకు కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనం నిర్మాణానికి ప్రభు త్వం స్థలం కేటాయించింది. అయితే హైకోర్టు నూతన భవనానికి కేటాయించిన భూ ములు వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీ భూములు కావడంతో వా టిని వెనక్కి తీసుకుని మరో చోట హైకోర్టుకు భూములు కేటాయించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రభు త్వం మాత్రం వారి ఆందోళనను పట్టించుకోకుండా అవే భూముల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సిద్ధమైంది.
- Advertisement -