Saturday, November 23, 2024

అధునాత‌న సాంకేతిక కేంద్రాలుగా ఐటిఐలు

- Advertisement -
- Advertisement -

రూ.2,324.21 కోట్ల‌తో ఐటిఐల ఆధునీక‌ర‌ణ‌
నేడు మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఎటిసిల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్: ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల (ఇండ‌స్ట్రీ 4.0) అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఎటిసి) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటిఐల‌ను ఎటిసిలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటిఐల‌నుఎటిసిలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టిటిఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవొయు) కుదుర్చుకుంది. ఎటిసిల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు మ‌ల్లేప‌ల్లి ఐటిఐలో శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఐటిసిల‌కు సంబంధించిన ముఖ్య అంశాలు..

* 65 ఐటీఐల‌ను ఎటిసిలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
* ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎటిసిల్లో యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు.
* శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టిటిఎల్ నియ‌మిస్తుంది.
* ఎటిసిల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు.
* గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రంలోని ఐటిఐల్లో కేవ‌లం 1.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే శిక్ష‌ణ పొందారు. ఈ ఎటిసిల‌తో రానున్న ప‌దేళ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందుతారు.
* ఐటీఐల‌ను ఎటిసిలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టిటిఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74)
* ఎటిసిలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి. అలాగే ఈ ఎటిసిలు ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లతో పాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయి.
* ఎటిసిల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది.
* ఎటిసిలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అంద‌జేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News