Friday, December 20, 2024

ఆరోగ్యంలో తెలంగాణ అగ్రగామి:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : తెలంగాణ ప్రజలకు వైద్యం అందించడంలో మన ప్రభుత్వం అగ్రస్థానానికి చేరుకుందని, ప్రజల కోసం నిర్మించిన,నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలలో పదివేల పడకల సామర్థానికి చేరుకుంటుందని రాస్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి, గండిమాసానిపేట్ గ్రామంలో నిర్మించనున్న బస్తీ దవాఖాన నిర్మాణానికి ఆదివారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వల్ల పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్యం అందుతుందన్నారు.

ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చోప్పున 33 కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయని, మన ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి లలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అయిందని ఆయన గుర్తు చేశారు. గతంలో డయాలసిస్ సెంటర్లు లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురైయ్యారని,ప్రస్థుతం ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటైందని అన్నారు.రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు రోగులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. డబాలసిస్ చేయించుకునే రోగులకు ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్ పాసులు అందిస్తుందని పేర్కొన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి శాతం 63 కు చేరుకుందని ఇది చాలా శుభపరిణామమని తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకే బి కేటగిరీల్లో 85 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

బిడ్డ కడుపులో పని నుంచి ఇంటికి వెళేల వరకు తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రభుత్వమే శ్రద్ద కనబరుస్తుందన్నారు. ఇందుకోసం న్యూట్రీషియన్ కిట్లతో పాటు కేసీఆర్ కిట్లను వారికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు వైద్యం అందిచడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం సాధించిందని వివరించారు. గత కాంగ్రేస్ ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 17 వేల బెడ్లు ఉండగా అది 50 వేల బెడ్ల సామర్థానికి చేరుతుందని చెప్పారు. కాంగ్రేస్ ప్రహుత్వం హాయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత వల్ల రోగులు వచ్చేవారు కాదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురెందర్ మాట్లాడుతు ఎల్లారెడ్డి అభివృద్దికి అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తున్న హరీష్ రావు వల్లే 100 పడకల ఆసుపత్రి మంజూరైందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్దిలో మంత్రి హరీష్ రావు తనకు ఆదర్శమని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News