సిటీబ్యూరో: మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్‌క్లేవ్, స్టాలీన్‌నగర్, ఎఫ్‌సిఐ, కాలనీ, జేపి నగర్, నాగార్జున ఎన్‌క్లేవ్, మయూరినగర్, డోవ కాలనీలలో 11 కోట్ల 81 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో పనిచేస్తుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో, మంత్రి కెటిఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్ధుతానని అన్నారు. అదేవిధంగా ప్రతి కాలనీలో మెరుగైన, సుఖవంతమైన ప్రయాణానికి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా వరదనీటి కాల్వ నిర్మాణం పనులు కూడా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకుసవస్తామని అన్నారు.
నూతనంగా చేపట్టే అభివృద్ధి ప నుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నాణ్యతతో త్వరగా పూర్తి చేసి ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు.