Monday, December 23, 2024

మన్సూరాబాద్‌లో రూ.78.20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: ఎల్బీనగర్‌లో ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో వీరబోగ వసంతరాయనగర్ కాలనీ రూ.25.80 లక్షలు, జడ్జిస్ కాలనీ మోడల్ మార్కెట్ సిసి రోడ్డుకు రూ.15.50 లక్షలు, వినాయక్ నగర్ కాలనీ ఫేజ్ 1 సిసి రోడ్డు పనులకు రూ. 36.90 లక్షలతో మొత్తం 78.20 లక్షలతో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మరెడ్డిలతో కలసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కాలనీ మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, ప్రతి కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, రహదారి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్షం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జిస్ కాలనీ అధ్యక్షులు వట్టి చంద్రారెడ్డి, కార్యదర్శి జనార్దన్‌రావు, కోశాధికారి కాలివర్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు టంగుటూరి నాగరాజు, రవికూమార్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు చంద్రకాంత రెడ్డి, అమ్మదయ కాలనీ ప్రతినిధిలు శ్రీశైలం, వెంకటేష్ యాదవ్, సాయికూమార్‌లు, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కడి మల్లారెడ్డి , జగదీష్ యాదవ్, జక్కడి రఘువీర్‌రెడ్డి , విజయ్ భాస్కర్‌రెడ్డి , ఎఆర్‌సీ రెడ్డి భాజపా నాయకులు నాంపల్లి రామేశ్వర్, పాతురి శ్రీధర్‌గౌడ్ , కడారియాదగిరి, యాంజల జగన్, నవీన్, నాంపల్లి శంకరయ్యలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News