యాదాద్రి:తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీన రసింహస్వామి సన్నిధిలో మంజూరైన వైద్యకళాశాల ని ర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియేట్‌లోని కాన్ఫరెన్ ్స హాల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వైద్యకళాశాల నిర్మాణంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డైరెక్ట ర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గణపతి, వైటీడీఏ కిషన్‌రెడ్డితో కలిసి సమీక్షను నిర్వహించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో 20 ఎకరాల స్థలంలో అద్భుతంగా వైద్యకళాశాలను నిర్మించాలని, వైద్యకళాశాలతో రాబోయే కాలంలో భక్తులకు ఎలాంటి లోటు లే కుండా అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. కళాశాలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వైద్యకళాశాలగా నామకరణం నిర్ణయించారు. వైద్యకళాశాల నిర్మాణం కోసం మూడు చోట్ల స్థలాలను గు ర్తించి, ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలియజేసినట్లు, కెసిఆర్ తుది నిర్ణయం పూర్తయిన వె ంటనే శంకుస్థాపన కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ స్థలంతో పాటు వైటీడీఏ పరిధిలో సేకరించిన స్థలాలను వైద్యకళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యకళాశాల నిర్మాణం కోసం వెంటనే శంకుస్థాపన చేసి పనులు చేపట్టే విధంగా చర్యలు కొనసాగనున్నట్టు తెలుస్తుంది.