Friday, January 10, 2025

హైదరాబాద్ లో మోనిన్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ ఫ్రెంచ్ గౌర్మెట్ ఫ్లేవరింగ్స్ కంపెనీ, జార్జెస్ మోనిన్ SAS – MONIN భారతదేశంలో తన మొదటి తయారీ యూనిట్‌కు శంకు స్థాపనను 13 సెప్టెంబర్ 2023న చేసింది. హైదరాబాద్ నగర శివార్లలో సంగారెడ్డి జిల్లాలోని గుంటపల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలంలో ఇది ఏర్పాటు చేయబడుతుంది. ఈ యూనిట్ మోనిన్ కు తమ భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. కె.టి.రామారావు మాట్లాడుతూ.. “తెలంగాణలో తమ కార్యకలాపాలను మోనిన్ ప్రారంభించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమర్ధవంతమైన నాయకత్వంలో, పెట్టుబడిదారులు తెలంగాణలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా మా విధానాలను సరళీకృతం చేయడానికి వీలైనంతగా మేము అన్ని ప్రయత్నాలనూ చేసాము. రాష్ట్రంలో పెట్టుబడిదారుల సుదీర్ఘ జాబితాలో మోనిన్ చేరడంతో, తెలంగాణ ఆహార ప్రాసెసింగ్ పర్యావరణ వ్యవస్థ మరో మెట్టు పైకి వెళ్లింది. తెలంగాణను తమ హబ్‌గా మార్చు కోవాల్సిందిగా నేను మోనిన్‌ని కోరుతున్నాను. వారు ఇప్పుడు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నాను.” అని అన్నారు. మోనిన్ బృందానికి స్థానిక శాసనసభ్యులతో పాటుగా స్థానిక పరిపాలన యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని కె టి రామారావు హామీ ఇచ్చారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలల్సిందిగా ఆయన మోనిన్‌ను అభ్యర్థించారు.

“భారతదేశం, గత కొన్ని సంవత్సరాలుగా, అగ్ర శ్రేణి ప్రాధాన్యత మార్కెట్‌గా మారింది. ఇది భారతదేశంలో పూర్తిగా మా యాజమాన్య అనుబంధ సంస్థను స్థాపించడానికి మమ్మల్ని పురికొల్పింది” అని ఒలివర్ మోనిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..“ ఒడిసి పట్టని దాని వాణిజ్య సంభావ్యత పరంగా మాత్రమే కాదు, ఇప్పటికే వైవిధ్యం, ప్రతిభ, ఆవిష్కరణలతో నిండిన దేశానికి సేవ చేయడంలో ఉన్న థ్రిల్ కారణంగా కూడా మోనిన్‌కు ఒక ముఖ్యమైన మార్కెట్ గా ఇండియా నిలుస్తుంది. మా విస్తరణ ప్రణాళికలకు ఈ కేంద్రం తోడ్పడటం తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వాములకు ప్రీమియం పానీయాల పరిష్కారాలను అందించే మా లక్ష్యాన్ని సాధించడంలో మాకు సహాయపడుతుంది” అని అన్నారు.

మొదటి దశలో 2,00,000+ చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతాన్ని నిర్మించడానికి MONIN ప్రణాళిక చేస్తుంది. ఇందులో MONIN ఇండియా ప్రధాన కార్యాలయం, సమగ్ర R&D కేంద్రం, ఉత్పత్తి యూనిట్ ఉన్నాయి. ఈ అత్యాధునిక తయారీ సదుపాయం ప్రధానంగా భారతదేశ కస్టమర్ బేస్, పొరుగున ఉన్న దక్షిణాసియా మార్కెట్‌ల అవసరాలను తీర్చనుంది. అన్ని ప్రాంతాల మార్కెట్ అవసరాలను తీర్చడానికి ఈ యూనిట్ రూపొందించబడింది. రుచి పునరుజ్జీవనోద్యమానికి వేదికను ఏర్పాటు చేయడం ద్వారా, ఈ సౌకర్యం భారతదేశం యొక్క రుచికర ప్రయాణంలో ఒక ముందడుగుగా నిలుస్తుంది.

మోనిన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జర్మైన్ అరౌద్ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ.. “కొత్త రుచులను అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండే యువతతో కూడిన భారతదేశం లో అవకాశాలను అన్వేషించటం పై, మా బ్రాండ్‌ను అభివృద్ధి చేయడం పట్ల మేము చాలా ఆశాజనకంగా వున్నాము. భారతదేశంలో R&D, తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే, మా ప్రధాన కస్టమర్ల డిమాండ్‌ను మరింత సమర్ధవంతంగా ప్రత్యేక ప్రిపరేషన్‌లతో తీర్చడం. అంతేకాకుండా, స్థానిక రుచులను మేము ఇతర MONIN సంస్థలకు తీసుకెళ్లే ముందు భారతదేశంలో మొదట పరిచయం చేయవచ్చు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా భాగస్వాములందరికీ ప్రీమియం పానీయాల పరిష్కారాలను అందించనున్నాము” అని అన్నారు.

తెలంగాణలో తన ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టాలనే తమ నిబద్ధతను సాకారం చేస్తూ MONIN ఈ యూనిట్ నెలకొల్పుతుంది. గుంటపల్లిలో ఏర్పాటు చేసిన ఈ భారతదేశ ప్రధాన కార్యాలయం, ఉత్పత్తి, R&D సౌకర్యంతో, MONIN ప్రాజెక్టు ఫేజ్ 1లో తెలంగాణ రాష్ట్రం లో రూ.300+ కోట్లు పెట్టనుంది. ఈ యూనిట్ ద్వారా ఫేజ్ 1 లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి పైగా ఉపాధిని అందించనుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల పరిపాలన వ్యవస్థతో కీలకమైన ఆధునిక నగరంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇది వ్యాపార వెంచర్‌లకు అనువైన ప్రదేశంగానూ నిలుస్తుంది.

MONIN కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7 ఉత్పత్తి సౌకర్యాలు వున్నాయి. వాటీలో ఫ్రాన్స్‌లో రెండు, USAలో రెండు, రష్యాలో ఒకటి, మలేషియాలో ఒకటి, చైనాలో ఒకటి వున్నాయి. భారతదేశంలోని ఈ అత్యాధునిక సదుపాయంతో పాటు బ్రెజిల్‌లోని మరొకటి MONIN యొక్క ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ప్రొడక్షన్ లైన్‌లలో కొత్త చేర్పులుగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News