Monday, December 23, 2024

33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామపంచాయతీలో గురువారం సుమారు రెండు కోట్ల వ్యయంతో సుదరన్ పవర్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 33/11 కెవి విద్యుత్ ఉపకేందర శంకుస్థాపన ప్రారంభోత్సవం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంతో పాటు తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను ఇన్సూరె న్స్ చెక్కులను కూడా అందించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో అన్ని రంగాలలో ముందుకెళ్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఈ దేవకుమార్, నాంపల్లి ఏడి ఎం సాగర్‌రెడ్డి మర్రిగూడ ఏ ఈబి రాజేష్, కన్స్రక్షన్ ఏఈ బాల్‌రెడ్డ్డి, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీ సీ పాశం సురేందర్‌రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, తి రుగండ్లపల్లి సర్పంచ్ అయితపాక జంగయ్య, ఎంపీటీసీ గండికోట రాజమణి, హరికృష్ణ, వెంకటేశ్వరరావు, బచ్చు రామకృష్ణ, లపంగి నరసింహ, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరుతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News