Thursday, November 14, 2024

గోల్డ్ షాప్ రాబరీ కేసులో మరో నలుగురు నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పాట్‌మార్కెట్‌లోని జూవెల్లరీ షాపు దోపిడీ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గతంలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, సంగ్లీ జిల్లా, ఖానాపూర్‌కు చెందిన అమూల్ గణపతిరావు జాదవ్, రుషికేష్ వినోద్ జాదవ్ అలియాస్ సిద్దు అలియాస్ సిద్ధార్థ జాదవ్,

శుభం వినోద్ జాదవ్ అలియాస్ విక్కీ అలియాస్ రాహుల్, సంజయ్ పరుసురాం జాదవ్‌ను అరెస్టు చేశారు. నిందితులు ఐటి అధికారుల పేరుతో పాట్‌మార్కెట్‌లోని జూవెల్లర్స్‌లో సిబ్బందిని బంధించిన అందులోని బంగారు కడ్డీలతో పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో అప్పుడు పరారీలో ఉన్న నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, శ్రీకాంత్, ఎస్సైలు అశోక్‌రెడ్డి, గణదీప్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News